కేసీఆర్‌ను పరామర్శించిన కాంగ్రెస్ మాజీ మంత్రి జానారెడ్డి

by Disha Web Desk 19 |
కేసీఆర్‌ను పరామర్శించిన కాంగ్రెస్ మాజీ మంత్రి జానారెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తుంటి ఎముక విరగడంతో యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పరామర్శించారు. శుక్రవారం జానారెడ్డి తన సతీమణి, తన కుమారుడు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డితో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ కేసీఆర్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కేసీఆర్ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా కేసీఆర్ ఆరోగ్యంపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ట్వీట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ గాయపడటం బాధాకరం అని ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. కాగా ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని హరీష్ రావు తెలిపారు. టెస్టుల తర్వాత హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారన్నారు. ఇవాళ సాయంత్రం కేసీఆర్‌కు సర్జరీ చేస్తారని తెలిపారు.Next Story