- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Jainoor: జైనూర్ ఘటనపై నివేదిక ఇవ్వండి.. తెలంగాణ డీజీపికి జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలు
దిశ. డైనమిక్ బ్యూరో: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో లైంగిక దాడికి గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసి మహిళను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్, తెలంగాణ మహిళా కమీషన్ చైర్మన్ నేరెళ్ళ శారద వేర్వేరుగా పరామర్శించారు. జైనూర్ ఘటన గురించి తెలుసుకున్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ గాంధీ ఆసుపత్రికి వెళ్ళారు. బాధిత మహిళను పరామర్శించిన ఆయన ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి సూపరిండెంట్ ను ఆరా తీశారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. అంతేగాక ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపికి ఆదేశాలు ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. గాంధీ ఆసుపత్రికి వెళ్లిన నేరేళ్ల శారద ఘటన గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆమెకు అన్ని రకాలుగా సహాయ సాహాకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కాగా కొద్ది రోజుల క్రితం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ ఆదివాసి మహిళ షేక్ మఖ్దూం అనే ఆటో డ్రైవర్ చేతిలో అత్యాచారయత్నానికి గురైంది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆదీవాసీలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జైనూర్ లో 144 సెక్షన్ అమలు పరిచారు.