పొంగులేటి నివాసంలో ముగిసిన ఐటీ రెయిడ్స్.. 36 గంటలపాటు సాగిన తనిఖీలు

by Disha Web Desk 19 |
పొంగులేటి నివాసంలో ముగిసిన ఐటీ రెయిడ్స్.. 36 గంటలపాటు సాగిన తనిఖీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. గురువారం తెల్లవారుజామున మొదలైన తనిఖీలు శుక్రవారం కూడా కొనసాగాయి. మొత్తంగా 36 గంటల పాటు పొంగులేటి ఇళ్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ రెయిడ్స్ ముగిసిన అనంతరం జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసంలో నుంచి మూడు బ్యాగులు, ఒక భ్రీఫ్ కేస్, ప్రింటర్, కీలక డాక్యుమెంట్లను సీఆర్‌పీఎఫ్ బలగాల రక్షణలో తరలించారు. పొంగులేటి రూమ్ లాక్ చేసి ఉండటంతో కీ కోసం ఇవాళ మధ్యాహ్నం వరకు ఎదురు చూసిన అధికారులు.. చివరకు డోర్ బ్రేక్ చేసి లోపలికి వెల్లి సోదాలు జరిపారు.

Read More:

అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారెంటీగా రిటన్​ గిఫ్ట్​ ఇస్తాం

Next Story

Most Viewed