ఖమ్మం సభలో రాహుల్ ప్రకటించే హామీలు ఇవే!

by Javid Pasha |
ఖమ్మం సభలో రాహుల్ ప్రకటించే హామీలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: ఖమ్మం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభను నిర్వహిస్తోంది. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాగా ఈ సభలో రాహుల్ గాంధీ ఎలాంటి హామీలు ఇవ్వనున్నారు అనేది ఉత్కంఠగా మారింది. అయితే రాహుల్ గాంధీ ఖమ్మం సభా వేదికగా కొన్ని ముఖ్య హామీలు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.

పీపుల్స్ మార్చ్ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇచ్చిన హమీలకు అదనంగా రాహుల్ గాంధీ మరికొన్ని హామీలు ఇవ్వనున్నట్లు సమాచారం. రైతు బంధు తరహాలో కూలీ బంధు, ఒకే దఫాలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, నిరుపేదలు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల సాయం, రేషన్ బియ్యంతో పాటు 9 రకాల వస్తువులు, రూ.500కే గ్యాస్ సిలిండర్, పావలా వడ్డీకే మహిళలకు రుణాలు వంటి భట్టి ఇచ్చిన హామీలతో పాటు పలు ఇతర హామీలను రాహుల్ గాంధీ ఖమ్మం సభలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Next Story