డాక్టర్ల ప్రైవేట్ స్పేస్‌లో దూరడం హేయమైన చర్య

by Disha Web Desk |
డాక్టర్ల ప్రైవేట్ స్పేస్‌లో దూరడం హేయమైన చర్య
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ల పని తీరును పర్యవేక్షించేందుకు వారి మొబైల్ ఫోన్లలో జీపీఎస్‌ను అమర్చి 24/7 నిఘా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై బీజేపీ నేత దాసోజు శ్రవణ్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. GPS 2check Govt.Doctors ను ఇన్‌స్టాల్ చేసుకోమని డాక్టర్ల పర్సనల్ స్పేస్‌లోకి ప్రభుత్వం చొరబడి చాలా తెలివితక్కువ, అవమానకరమైన ఆలోచన చేసిందని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి స్పృహ ఉంటే, ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం విధించి, సమర్థవంతమైన ప్రజాసేవలో వారిని ప్రోత్సహించండి అంటూ శ్రవణ్ చురకలు అంటించారు.

జగన్ మరో సంస్థను నిర్మించడం శ్రేయస్కరం

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును తొలగించి, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరు పెట్టాలని నిన్న జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై దాసోజు శ్రవణ్ స్పందిస్తూ... ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరు ప్రజలకు, రాజకీయాలకు గణనీయమైన, తిరుగులేని కృషి చేసిన దిగ్గజాలు అంటూ పేర్కొన్నారు. వీరిద్దరి పేర్లు చరిత్రలో నిలిచిపోవాలని అన్నారు. అంయితే హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు చెరిపేయడం కంటే సీఎం జగన్ వైఎస్‌ఆర్‌ పేరుతో మరో సంస్థను నిర్మించడం శ్రేయస్కరం అంటూ శ్రవణ్ సూచించారు.


Next Story