- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అంటే ఇదేనా?' : కేంద్రంపై మండిపడ్డ హరీష్ రావు
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)కు బీజేపీ(BJP) అన్నిట్లో మొండిచెయ్యి చూపిస్తోందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు విడుదల చేసిన వరద సహాయంపై హరీష్ రావు స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు జరిపే అన్ని కేటాయింపుల్లో గుండుసున్నాలేనని మండి పడ్డారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి రాష్ట్రం నుండి 8 సీట్లు ఇస్తే రాష్ట్రానికి కేంద్రం ఒరగబెట్టింది మాత్రం శూన్యం అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఏమీ ఇవ్వలేదు, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్లలో మొండిచెయ్యి ఇచ్చిందని పేర్కొన్నారు. ఇక వరద సహాయం కింద ఇచ్చే ఎన్డీఆర్ఎఫ్(NDRF) నిధుల్లో పక్కనున్న ఏపీతో పోల్చుకుంటే సగం కంటే తక్కువే కేటాయింపులు చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఊదరగొట్టే సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అంటే ఇదేనా? అని కేంద్రాన్ని హరీష్ రావు నిలదీశారు. ఈ మేరకు హరీష్ రావు తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్టు పెట్టారు.