పాడి కౌశిక్ రెడ్డి టైగరేనా? అని అడిగిన కేసీఆర్! వారివి షాకింగ్ కామెంట్స్

by Ramesh N |
పాడి కౌశిక్ రెడ్డి టైగరేనా? అని అడిగిన కేసీఆర్! వారివి షాకింగ్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ సభలో గులాబీ బాస్ కేసీఆర్ హుజురాబాద్ ‘టైగర్’ అని పాడి కౌశిక్ రెడ్డిని పిలిచారు. దీంతో సభలో ఉన్నవారంతా గట్టిగా అరిచారు. కౌశిక్ రెడ్డి ఫాలోయింగ్ చూసి గులాబీ బాస్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి టైగరేనా? అని సభలో ప్రజలను అడిగారు.

దీంతో ప్రజలు టైగర్ అని సమాధానం చెబుతారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి టైగర్ ఏంటీ? ఓట్లు వేయకపోతే చచ్చిపోతాను అని బ్లాక్ మెయిల్ చేశారని ఓ నెటిజన్ విమర్శించారు. టైగర్స్ అంటే ఓట్లు అడుక్కోవు కదా అని నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Next Story