టూరిజం కార్పొరేషన్ ఎండీగా ఐపీఎస్ రమేశ్

by Shiva |
టూరిజం కార్పొరేషన్ ఎండీగా ఐపీఎస్ రమేశ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐపీఎస్ ఆఫీసర్ కే.రమేశ్ నాయుడు నియమితులయ్యారు. ప్రస్తుతం సీఐడీ డిప్యూటీ ఐజీగా ఉన్న ఆయనను కొత్త బాధ్యతల్లో నియమిస్తూ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఇన్నాళ్లు టూరిజం కార్పొరేషన్‌కు ఎండీగా ఉన్న బోయిన్‌పల్లి మనోహర్‌ను అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోడ్‌ను ఉల్లంఘించారన్న కారణంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్ర టూరిజం మంత్రి శ్రీనివాసగౌడ్‌తో కలిసి అక్టోబర్ సెకండ్ వీక్‌లో తిరుమలకు వెళ్లడాన్ని ఉదహరించింది. ఇప్పుడు కోడ్ ముగిసినా ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ వేటు ఇంకా కొనసాగుతూనే ఉంది. దీన్ని ఎత్తివేయడం రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారం అయినప్పటికీ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మనోహర్‌ను ఎండీగా కొనసాగించే వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉన్నందున ప్రభుత్వం ఐపీఎస్ అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. తక్షణం ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు.

Next Story

Most Viewed