- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
ఎన్డీఏలో చేరుతానని కేసీఆర్ అడిగే ఉంటాడు: విజయశాంతి ఇంట్రెస్టింగ్ ట్వీట్
by Disha Web Desk 19 |

X
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్.. ఎన్డీఏలో చేరుతామని ప్రధాని మోడీని అడిగి ఉండవచ్చని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ట్వీట్ చేశారు. ఇది నిజమయ్యే ఉంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 2009లో కూడా తెలంగాణాలో మహాకూటమి పేర కమ్యూనిస్టులుతో కలిసి పోటీ చేసిన కేసీఆర్.. కౌంటింగ్ డబ్బాలు తెరవక ముందే లుధియానాలో ఎన్డీఏ ర్యాలీకి హాజరైన వాస్తవం ప్రజలకు ఇంకా జ్ఞాపకముందని ఆమె పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ఈ విషయంలో మోడీని తిట్టటం అవసరం లేదని ట్వీట్ చేశారు. కాగా ఇప్పుడీ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఇటీవల ప్రధాని మోడీ పాలమూరు సభతో పాటు నిజామాబాద్ సభకు కూడా విజయశాంతి అటెండ్ అవ్వలేదు. పార్టీ వీడుతారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ సమయంలో ఆమె మోడీకి సపోర్ట్‌గా ట్వీట్ చేశారు. కాగా గతంలో పలు ట్వీట్లు ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చినట్లుగానే ఉండటం గమనార్హం.
Next Story