రాత్రి ప్రశాంతంగా నిద్రపోయా.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

by Disha Web Desk 19 |
రాత్రి ప్రశాంతంగా నిద్రపోయా.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. ఇక ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. అయితే నిన్న ముగిసిన పోలింగ్ తర్వాత పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అయితే ఆ ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్‌కే ఎక్కువ సీట్లు వస్తాయని ప్రకటించింది. ఈ ఎగ్జిట్ పోల్స్‌ను మంత్రి కేటీఆర్ నిన్న ఖండించారు. అయితే దాదాపు 3 నెలలుగా సాగిన ఎన్నికల హడావుడిలో రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకుడు నిద్రలు మాని వారి పార్టీల గెలుపు కోసం బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్ర పట్టింది. ఎగ్జిట్ పోల్స్ పెరగొచ్చు. కానీ, ఎగ్జాక్ట్ పోల్స్ మాత్రం మాకు గుడ్ న్యూస్‌ను ఇస్తాయి’ అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Next Story