63 సీట్లతో మూడోసారి అధికారంలోకి BRS..! శ్రీ ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు

by Disha Web Desk 19 |
63 సీట్లతో మూడోసారి అధికారంలోకి BRS..! శ్రీ ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలపై శ్రీ ఆత్మసాక్షి సర్వే సంస్థ ఎగ్జిట్స్ పోల్స్ విడుదల చేసింది. బీఆర్ఎస్ 58 నుండి 63 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 48 నుండి 51 సీట్లు గెలిచి రెండ స్థానానికి పరిమితమవుతోందని వెల్లడించింది. ఇక, బీజేపీ 5 నుండి 10 స్థానాలు, ఇతరులు 7 నుండి 9 తొమ్మది స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు శ్రీ ఆత్మసాక్షి సంస్థ తమ ఎగ్జిట్స్ పోల్స్ ఫలితాల్లో వెల్లడించింది. అయితే, ఇప్పటి వరకు వెలువడిన వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్‌లో మెజార్టీ సంస్థలు కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెల్చుకుంటుందని ఫలితాలు వెల్లడించాయి. ఈ ఫలితాలకు భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ అధిక సీట్లు సాధిస్తుందని శ్రీ ఆత్మసాక్షి సంస్థ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడం గమనార్హంNext Story

Most Viewed