తెలంగాణ సమస్యలపై కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh N |
తెలంగాణ సమస్యలపై కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర మంత్రిగా తెలంగాణ సమస్యలపై దృష్టి పెడతానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా చాలా కార్యక్రమాలు చేయాలని తనకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పిన మాటలు గుర్తు చేశారు. ఆ అనుబంధం ఎప్పుడు కొనసాగించాలన్నారు. తనకు పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు రావడం వల్ల అనుబంధం కొనసాగించే అవకాశం వచ్చిందన్నారు. మా తెలంగాణ ప్రజలకు కూడా చేరువయ్యే అవకాశం దక్కిందన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రిగా తెలంగాణ సమస్యలపై దృష్టి పెడతానని ఆయన స్పష్టం చేశారు. సహచర మంత్రి వర్గంతో గాని.. ఇక్కడి ముఖ్యమంత్రితో గాని.. ఎటువంటి భేదాలు పెట్టుకోకుండా తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతాన్ని కూడా న్యాయం చేస్తానని చెప్పారు. మరోవైపు ఏపీలో ఎయిర్‌పోర్టల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులను జెట్ స్పీడ్‌తో పూర్తి చేస్తానని చెప్పారు.

Next Story

Most Viewed