సర్టిఫికెట్లు ఇవ్వకపోతే కఠిన చర్యలు.. ఇంటర్ బోర్డు వార్నింగ్

by Disha Web Desk 4 |
సర్టిఫికెట్లు ఇవ్వకపోతే కఠిన చర్యలు.. ఇంటర్ బోర్డు వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: నారాయణ కాలేజ్ ఘటన నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్సు పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. ఏ కారణంతోనూ విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపవద్దని, సర్టిఫికెట్లు ఇవ్వకపోతే డీఐఈవో లేదా ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ప్రైవేట్ కాలేజీలను తనిఖీలు చేయాలని జిల్లా అధికారులకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. సర్టిఫికేట్లు ఇవ్వని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. నారాయణ కాలేజీ ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డు కార్యదర్శికి విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Next Story

Most Viewed