ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. 2022 ఇంటర్ పాస్ సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్

by Mahesh |
ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. 2022 ఇంటర్ పాస్ సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. మే-2022 లో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన పాస్ సర్టిఫికేట్లను జూనియర్ కాలేజీలకు పంపినట్లు తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు సర్టిఫికేట్లను తమ తమ కాలేజీ యాజమాన్యం దగ్గర తీసుకోవాలని సూచించింది. సోమవారం (7వ తేదీ) నుంచి సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. కానీ ఈ ప్రకటనను ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం అధికారికంగా విడుదల చేసింది.



Next Story

Most Viewed