కేసీఆర్, కేటీఆర్.. మీ ఇంటి పేరును అలా మార్చుకోండి: ఇందిరా శోభన్ ఫైర్

by Disha Web Desk 19 |
కేసీఆర్, కేటీఆర్.. మీ ఇంటి పేరును అలా మార్చుకోండి: ఇందిరా శోభన్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైతు రుణమాఫీ విషయంలో కేటీఆర్.. రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఇందిరాశోభన్ ఫైర్ అయ్యారు. కేసీఆర్, కేటీఆర్‌ల ఇంటిపేర్లను కల్వకుంట్ల కాకుండా ‘అబద్ధాల’ అని మార్చుకోవాలని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జీరో అని కేసీఆర్ చెప్పడంపై ఇందిరా శోభన్ ఆదివారం ట్విట్టర్ వేదికగా ఆర్టీఐ నివేదికను విడుదల చేశారు.

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు జీరో అంటున్న కేసీఆర్, రైతు స్వరాజ్య వేదిక ఇచ్చిన ఎన్‌సీఆర్బీ ప్రకారం గత 10సం డాటా ఆర్టీఐ ఆధారాలతో ఉన్న నివేదికను చూడాలని సూచించారు. 2015లో 1400, 2016లో 645, 2017 లో 851, 2018లో 908, 2014 నుండి 2022 వరకు 6912 రైతు ఆత్మహత్యలు జరిగాయని పేర్కొన్నారు. కానీ, కేసీఆర్ ఆత్మహత్యలే లేవని జీరో అని చెప్పడం అన్యాయం అన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అబద్ధం నిజం అవుతదా అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.



Next Story

Most Viewed