ప్రాజెక్టుల అసంపూర్తి నిర్మాణం ప్రభుత్వ వైఫల్యమే: జ్ఞానేశ్వర్

by Disha Web Desk 11 |
ప్రాజెక్టుల అసంపూర్తి నిర్మాణం ప్రభుత్వ వైఫల్యమే: జ్ఞానేశ్వర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావడం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మండిపడ్డారు.ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులన్నీ టీడీపీ పాలనలో ప్రారంభించినవే అన్నారు. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిలసాగర్ తదితర లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్, చంద్రబాబునాయుడులేనని తెలిపారు. 25వేల కోట్లతో పూర్తయ్యే 26 ప్రాజెక్టుల నిర్మాణ పనులు ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. ఉపాధి కల్పనలో వైఫల్యం కారణంగా వలసలు పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు. గత ఎనిమిదేళ్లుగా విద్య, ఉపాధి, వైద్య రంగాలను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ ప్రధానకార్యదర్శి జక్కలి ఐలయ్యయాదవ్, బక్కని నర్సింహులు, కాసీం, బాలకిశోర్ యాదవ్, రాములు యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed