తెలంగాణలో రాహుల్ యాత్ర కొనసాగేది ఆ ప్రాంతాల్లోనే!

by Disha Web Desk 16 |
తెలంగాణలో రాహుల్ యాత్ర కొనసాగేది ఆ ప్రాంతాల్లోనే!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది. కాగా.. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఈనెల 24న యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనున్నది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డీజీపీ మహేందర్ రెడ్డిని కూడా కలిశారు. భద్రతా ఏర్పాటు చేసేందుకు డీజీపీ అంగీకరించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాకు తెలిపారు.

మొదటగా ఔటర్ రింగ్ రోడ్, వికారాబాద్ మీదుగా అన్నారు. తాజాగా రాహుల్ గాంధీ పాదయాత్ర శంషాబాద్, ఆరామ్‌గఢ్, చార్మినార్, అఫ్జల్‌గంజ్, మోజంజాహీ మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి దర్గా, విజయనగర్ కాలనీ, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్‌చెరు సహా నగరంలోని ప్రధాన ప్రాంతాల గుండా వెళుతుంది నిర్ణయించారు. అయితే చార్మినార్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర వెళ్తుండగా అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించేలా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రణాళికలు చేస్తున్నారు. ఈ రూట్ మ్యాప్‌ను దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్ పరిశీలించి రూట్ మ్యాప్‌ను ఫైనల్ చేయనుట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed