- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు భరోసా వద్దని నెలరోజులు తిరిగా.. జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
కౌలు రైతుల సమస్యలపై జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. రికార్డుల్లో కాలమ్ నంబర్ 16ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వాస్తవంగా సాగు చేసే వారికే వ్యవసాయ సబ్సిడీ, ఎరువులు, అప్పులు, ఇన్సూరెన్స్ సౌకర్యం, మద్దతు ధర కల్పించాలని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కౌలు రైతులకు ఇచ్చిన హామీతో పాటు వరంగల్ డిక్లరేషన్‍ను అమలు చేయాలన్నారు. ఇవాళ హైదరాబాద్‍లో కౌలు రైతుల సమస్యలపై నిర్వహించిన రౌడ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన ఆయన.. బూజు పట్టిన రాజు అనుకున్న కాలంలోనే రికార్డుల్లో నంబర్ 16 అమల్లో ఉందని తెలంగాణ రాగానే ఈ కాలం తొలగించారన్నారు. తిరిగి కాలం నంబర్ 16 పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. నాకు సుప్రీంకోర్టు నుండి పెన్షన్ వస్తుంది. ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లిస్తాను. ఉండటానికి ఇల్లు కూడా ఉంది. అయినా నాకు రైతు భరోసా ఇస్తుంటే దాన్ని వదిలించుకోవడానికి రెండు నెలలు అధికారుల చుట్టూ తిరిగానన్నారు. ఎలాగోలా రైతుభరోసాను వదిలించుకున్నట్లు చెప్పారు. రాష్ట్రాంలో కౌలు రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.






