- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వృద్ధురాలిని చంపి శవంపై డాన్సులు.. వీడియో తీసి మిత్రులకు షేర్ చేసిన యువకుడు

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని కుషాయిగూడలో దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 70 ఏళ్ల వృద్ధురాలిని చంపి మృతదేహంపై ఓ యువకుడు డాన్సులు వేశారు. మరోవైపు మృతదేహంపై డాన్సులు చేస్తూ సెల్ఫీ వీడియో తీసి మిత్రులందరికీ యువకుడు షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కుషాయిగూడలో షాపు అద్దె చెల్లించాలని వృద్దురాలు కమలాదేవి(70) ఓ యువకుడిని అడిగింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ రావడంతో, ఈ నెల 11న యువకుడు కమలాదేవికి ఉరేసి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహంపై డాన్స్ చేస్తూ వీడియో తీసి స్నేహితులకు పంపి, ఇంటికి తాళం వేసి యువకుడు పారిపోయాడు.
ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శవంపై డాన్స్ చేస్తూ తీసిన వీడియోలు బెంగళూరులో వైరల్ కావడంతో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ముగ్గురిలో ఒక మైనర్ బాలుడు ఉన్నట్లు తెలిసింది. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. ఓ రాజస్థాని కుటుంబం 30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. బాధితురాలి భర్త 15 ఏళ్ల కిందట మరణించడంతో కమలా దేవి కృష్ణ నగర్‌లో దుకాణం నిర్వహిస్తూ బతుకుతోంది. ఆమెకు కొన్ని దుకాణాలు ఉండటంతో నెలకు రూ.50 వేల వరకు అద్దె వస్తుంది. అయితే, నిందితుడు ఆమె దుకాణంలోనే పనిచేసేవాడు. ఇటీవల నిందితుడితో కమలకు మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి ఆమెపై యువకుడు పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న రాత్రి ఆమెను హత్య చేసి.. ఫ్యాన్‌కు ఆమె చీరతోనే ఉరివేసి ఎస్కేఫ్ అయ్యాడు.