Hyderabad Metro: మెట్రో ట్రాక్‌పై యువకుడి హల్ చల్.. టెన్షన్‌లో అధికారులు

by samatah |   ( Updated:2022-05-02 07:11:32.0  )
Hyderabad Metro: మెట్రో ట్రాక్‌పై యువకుడి హల్ చల్.. టెన్షన్‌లో అధికారులు
X

Hyderabad Metro

దిశ, వెబ్‌డెస్క్ : హైదారాబాద్ మెట్రో రైల్ అధికారులను ఓ యువకుడు టెన్షన్ పెంట్టించాడు. మెట్రో ట్రాక్‌పై 3 గంటల పాటు హంగామా చేశాడు. సికింద్రాబాద్(Secunderabad) నుంచి వెస్ట్ జేబీఎస్ మార్గంలో రైల్వే ట్రాక్‌పై యువకుడు నడుచుకుంటూ వెళ్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు సికింద్రాబాద్ నుంచి ఒకే ట్రాక్‌పై రాకపోకలు కొనసాగించారు. అనంతరం యువకుడి కోసం వెతకడం మొదలు పెట్టారు. చివరకు ట్రాక్ పక్కనున్న జాలి వద్ద దాక్కొని ఉన్న యువకుడిని అధికారులు గుర్తించారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి యథావిధిగా మెట్రో సర్వీసులు కొనసాగుతున్నాయి.

Next Story

Most Viewed