ఒక్కరోజులోనే 53 ఫిర్యాదులను పరిష్కరించాం: ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి

by Shiva |
ఒక్కరోజులోనే 53 ఫిర్యాదులను పరిష్కరించాం: ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి
X

దిశ, సిటీ బ్యూరో: మహా నగరంలో తరుచూ కురుస్తున్న వర్షాల కారణంగా ఆదివారం ఒక్క రోజే మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కేవలం 6 గంటల వ్యవధిలోనే ప్రజల నుంచి మొత్తం 53 ఫిర్యాదులు వచ్చినట్లు ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. స్వీకరించిన మొత్తం ఫిర్యాదుల్లో 47 ఫిర్యాదులను పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. వీటిలో ట్రీ ఫాల్ ఫిర్యాదులు 48 కాగా, నీటి గుంతలకు సంబంధించి 5 ఫిర్యాదులు ఉన్నట్లు తెలిపారు. వీటిలో ట్రీ ఫాల్‌కు సంబంధించిన 42 ఫిర్యాదులను పరిష్కరించినట్లు, నీటి గుంతలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం ఇంకా కొనసాగుతున్నట్లు ఆయన వివరించారు. మరో 6 ట్రీ ఫాల్ ఫిర్యాదుల పరిష్కారం వివిధ దశల్లో ఉన్నట్లు డైరెక్టర్ తెలిపారు. హైదరాబాద్ మహా నగరానికి సంబంధించి వాతావరణ శాఖ ఇచ్చే వర్షం అలర్ట్ ప్రకారం గ్రేటర్ పరిధిలో 30 డీఆర్ఎఫ్ టీమ్‌లు రౌండ్ ది క్లాక్ అప్రమత్తంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వర్షం కురుస్తున్నప్పుడు, కురిసి ఆగిన తర్వాత కూడా వర్షానికి సంబంధించిన ఫిర్యాదులు చేసేందుకు జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 21111111కు గానీ, మై జీహెచ్ఎంసీ యాప్‌కు గానీ, డయల్ 100 కు గానీ ఫిర్యాదులు చేయవచ్చునని డైరెక్టర్ సూచించారు.

Next Story

Most Viewed