అమరుల స్ఫూర్తిగా తుదిదశ తెలంగాణ ఉద్యమానికి సిద్ధం కావాలి: Revanth Reddy

by Disha Web Desk 12 |
అమరుల స్ఫూర్తిగా తుదిదశ తెలంగాణ ఉద్యమానికి సిద్ధం కావాలి: Revanth Reddy
X

దిశ, సికింద్రాబాద్: అమరవీరుల స్ఫూర్తిగా విద్యార్థులు తుది దశ తెలంగాణ ఉద్యమానికి సిద్ధం కావాలని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ సాధించుకున్నామో అవి ఇంకా నేరవెలేలేదనన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా యువజన సమితి, విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో శనివారం ఓయూలోని ఐసీఏస్ఏస్ఆర్ హాల్లో "తెలంగాణ యూత్ డిమాండ్స్ డే" కార్యక్రమాన్ని నిర్వహించారు.

యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సలీం పాషా అధ్యక్షతన కార్యక్రమానికి ముఖ్య అతిథులు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ పీఏల్ విశ్వేశ్వరరావు, సీపీఐ (ఎమ్ ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, పోరాట పటిమను ఓయూ కోల్పోలేదని చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణ చైతన్యం కనిపిస్తోందన్నారు.

నవంబర్ 29 గురించి మాట్లాడాలంటే శ్రీకాంత్ చారి గురించి మాట్లాడాలని, కేసిఆర్ దీక్ష గురించి కాదన్నారు. తెలంగాణలో దుర్మార్గమైన పాలన నడుస్తుందన్నారు ఎంతో మంది మేధావులను అందించిన ఓయూ ను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన మండిపడ్డారు. ఒక్కపుడు యూనివర్సిటీలోకి పోలీసులు రాలేని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం హాస్టల్‌లోకి కూడా పోలీసులు వస్తున్నారన్నారు. తెలంగాణ అంటే గుర్తొచ్చేది ఓయూ అన్నారు. తెలంగాణ సమాజం పై ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేసినప్పుడల్లా కొట్లాడిన గడ్డ ఓయూ అని గుర్తు చేశారు.

ఎవరు ఉద్యమకారులో, ఎవరు ఆ ముసుగులో దోచుకుంటున్నారో అందరికీ తెలుసన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చారంటే అది ఈ బిడ్డల త్యాగాల ఫలితమే తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. సామాజిక న్యాయాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారుని, సామాజిక న్యాయం లేని రాష్ట్రం రాష్ట్రమే కాదన్నారు. రాష్ట్రంలో మళ్లీ అలజడి రేగితే అందులో కేసీఆర్ కాలి బూడిద అవుతాడని తెలంగాణ సమాజాన్ని తక్కువ అంచనా వేయద్దని కేసీఆర్ ను హెచ్చరించారు.

అనంతరం ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడిందన్నారు. పోరాటాల ద్వారానే ప్రభుత్వ విద్యను సంరక్షణ చేయాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని గుర్తు చేశారు. పేదలకు విద్యను ఆదించకుండా సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు. అందులో బాగంగానే ప్రభుత్వ యూనివర్సిటీ లో బోధన బోధనేతర పోస్టులు ఖాళీగా ఉన్న భర్తీ చేయడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ విద్య మీద చిన్నచూపు మానుకోవాలని సూచించారు. అనంతరం టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ. పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం తనని కలిచి వేసిందన్నారు.

కేసీఆర్ ను ఓడించడానికి, ఉద్యోగాలు సాధించడానికి మరొక సారి సమరశిలా పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దానిలో బాగంగానే శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఈ పోరాటాలు కొనసాగించేందుకు పిలుపు ఇచ్చామని విద్యార్థులు, నిరుద్యోగులు కలిసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వీజేఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సర్దార్ వినోద్ కుమార్, స్టేట్ జనరల్ సెక్రటరీ మాసంపల్లి ఆరున్, యూత్ కో ఆర్డినేటర్ కొత్త రవి, స్టేట్ సెక్రటరీ పేరాల ప్రశాంత్, నరేందర్ నకిరేకంటి, జీవన్ రెడ్డి,కార్తీక్ రెడ్డి, జీవన్, గోపి, పాల్గొన్నారు.


Next Story