బైండోవర్ బాండ్ ఉల్లంఘన.. రౌడీ షీటర్ నుంచి రూ.1 లక్ష వసూలు

by Taduka Kalyani |

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా చాదర్‌ఘాట్ పోలీసులు రౌడీ షీటర్లపై కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు.

బైండోవర్ బాండ్ ఉల్లంఘన.. రౌడీ షీటర్ నుంచి రూ.1 లక్ష వసూలు
X

దిశ,చంపాపేట్ జూన్ 9: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా చాదర్‌ఘాట్ పోలీసులు రౌడీ షీటర్లపై కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. బ్యాండోవర్ బాండ్ నిబంధనలను ఉల్లంఘించిన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన రౌడీ షీటర్ మిర్జా సల్మాన్ అలీ బేగ్ నుంచి రూ.1 లక్ష బాండ్ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయించారు. పోలీసుల వివరాల ప్రకారం, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి. సజ్జనార్ ఆదేశాలు, చార్మినార్ జోన్ డీసీపీ శ్రీ కిరణ్ ఖరే మార్గదర్శకత్వం, మలక్‌పేట్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో ప్రజల శాంతిభద్రతల పరిరక్షణ కోసం నివారణాత్మక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో గతంలో మిర్జా సల్మాన్ అలీ బేగ్‌పై బౌండ్ ఓవర్ చర్యలు తీసుకున్నారు. అయితే అతడు బాండ్ నిబంధనలను ఉల్లంఘించడంతో సంబంధిత అధికారుల ఎదుట బాండ్ జప్తు ప్రక్రియ ప్రారంభించారు. అనంతరం చట్టపరమైన విచారణ పూర్తయ్యాక బాండ్ మొత్తాన్ని చెల్లించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు మంగళవారం రూ.1,00,000 మొత్తాన్ని చలాన్ రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. ఈ సందర్భంగా చాదర్‌ఘాట్ పోలీసులు మాట్లాడుతూ, బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించే రౌడీ షీటర్లు, అలవాటుగా నేరాలకు పాల్పడే వ్యక్తులపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

Next Story