- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. వాటికి అనుమతి లేదు..

దిశ ప్రతినిధి, హైదరాబాద్: టెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సెల్ ఫోన్లతో పరీక్షా కేంద్రాలకు హాజరైతే వారి నుండి ఫోన్లు స్వాధీనం చేసుకోవడమే కాకుండా పరీక్షలకు అనుమతించబోమని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శుక్రవారం ఆయన సంబంధిత శాఖల అధికారులతో టెట్ పరీక్ష ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈ నెల 12వ తేదీన టెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.
జిల్లాలో టెట్ పరీక్షకు ౧౧౭ కేంద్రాలను ఏర్పాటు చేయగా 35 వేల మంది పరీక్షలు రాయనున్నారని చెప్పారు. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరీక్షల సందర్భంగా కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని సెంటర్లలో త్రాగునీరు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యార్థుల సౌలభ్యం కోసం తగినన్ని బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతరాయం లేని విద్యుత్‌ను అందిచాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సెంటర్లకు సమీపంలోని జీరాక్స్ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.