- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నాకు లంబాడి భాష కూడా వచ్చు: ఎంపీ ఉత్తమ్

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములను లాక్కుంటుందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో ఒక్క గిరిజనుడికి పట్టా వచ్చిందా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో గాంధీభవన్ లో పోడు భూముల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలపై చర్చించారు. అనంతరం ఉత్తమ్మాట్లాడుతూ గిరిజనులపై కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తోందన్నారు. తాను లంబాడీ భాష కూడా మాట్లాడుతానని, తన నియోజకవర్గంలో లంబాడీ, గిరిజన సంక్షేమం కోసం పని చేయడం జరిగిందన్నారు. ప్రతి తండా, గూడెంలలో సీసీ రోడ్ల నిర్మాణం చేశానని, అప్పుడు చేసిన అభివృద్ధే ఇప్పుడు కనిపిస్తుందన్నారు. కానీ, ప్రస్తుతం టీఆర్ఎస్ పాలనలో తండాలు ఆగమయ్యాయని ఉత్తమ్ విమర్శించారు.
గిరిజన గ్రామాలకు నిధులు, నీళ్లు కల్పించడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యిండు, బంజారాహిల్స్ లో బంజారా భవన్ నిర్మించడం మంచిదే కానీ గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని సూచించారు. కొత్త గ్రామ పంచాయితీలకు బిల్డింగ్ లు కూడా లేకపోవడంతో చెట్ల కిందనే పాలన నడుస్తోందని, మునుగోడులో కూడా గిరిజన ప్రజల్లో అవగాహన కోసం సదస్సులు నిర్వహించాలన్నారు. గిరిజనులు ఐక్యంగా పోరాటం చేయాలని, మోడీ, కేసీఆర్ లను నిలదీసేందుకు తానున్నానని ఉత్తమ్ హామీ ఇచ్చారు.
ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ఏలేటీ మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ పోడు భూములపై కాంగ్రెస్పార్టీ పోరాటం చేస్తుందని, బాధితులకు అండగా ఉంటుందన్నారు. గిరిజన రిజర్వేషన్ల అమలు కాంగ్రెస్ తోనే సాధ్యమని, త్వరలోనే మంచి రోజులు వస్తాయన్నారు.