- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'చేనేత కార్మికులకు చేయూతను అందించాలి'

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: చేనేతకు చేయుతనందిచాలని తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు . ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆయన చేనేత వస్త్రాలు ధరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత వస్త్రాలకు, ప్రాధాన్యం ఇవ్వాలనే సదుద్దేశంతో ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరిస్తున్నట్లు తెలిపారు. నేత కార్మికులకు సామాజిక న్యాయం చేయడానికి, చేనేత కార్మిక రంగానికి ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవడమే కాకుండా చేనేత రంగానికి పెద్దపీట వేస్తోందని అన్నారు.
Next Story