ఆర్యవైశ్యులకు అండగా.. ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి: ఉప్పల శ్రీనివాస్ గుప్త

by Seetharam |
ఆర్యవైశ్యులకు అండగా.. ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి: ఉప్పల శ్రీనివాస్ గుప్త
X

దిశ, ఎల్బీనగర్: ఆర్యవైశ్యులకు అండగా.. ఆర్థిక భరోసాగా సీఎం సహాయనిధి నిలుస్తుందని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ మండల కేంద్రానికి చెందిన కిరాణ దుకాణం నిర్వహించే సింగంశెట్టి గోపాల్ బ్రెయిన్‌కి ఇటీవల శస్త్ర చికిత్స జరుగగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 60 వేల రూపాయలను నాగోల్‌లోని తన కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశాడు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. సీఎం సహాయనిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుందని అన్నారు. ఆపదలో సీఎం సహాయనిధి ఆపద్భందువునిగా అదుకుంటుందని ఆయన తెలిపారు. మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని తెలిపారు.

వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుందని, బాధితులు అవసరమైన సమయాలలో సీఎం రిలీఫ్ ఫండ్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ కలకొండ మనిమాల, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చైతన్యపురి డివిజన్ ట్రెజరర్ దర సరిత, టీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్ గౌడ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed