- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కార్పొరేట్ ఆస్పత్రిలో కరువైన భద్రత.. డాక్టర్ రూపంలో అగంతకుడు..

దిశ, ఖైరతాబాద్: బంజారాహిల్స్ లోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి(విరంచి)లో రోగులకి భద్రత లేకుండా పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం తమ హాస్పిటల్ లో ఐసీయూలో వైద్యం పొందుతున్న ఓ రోగి దగ్గరికి గుర్తు తెలియని ఓ వ్యక్తి డాక్టర్ వేషంలో వచ్చి నర్సు ద్వారా రోగి కీ షీట్ ను తీసుకొని అందులో ఉన్న రోగి అటెండర్ కు ఫోన్ చేసి పేషెంట్ కి అత్యవసరంగా సర్జరీ చేయాలి. అందుకు సంబంధించిన కొన్ని వైద్య పరీక్షల కోసం వెంటనే 15 వేల రూపాయలను తన అకౌంట్లో జమ చేయమని కోరాడని అన్నారు.
దీంతో కంగుతిన్న రోగి అటెండర్ తాము ఈఎస్ఐ క్రింద ఆసుపత్రిలో జాయిన్ అయ్యామని, తాము ఎందుకు డబ్బులు చెల్లించాలని ప్రశ్నించగా పేషేంట్‌కు చేయాల్సిన కొన్ని వైద్య పరీక్షలు తమ ఆసుపత్రిలో నిర్వహించడం కుదరదని అందుకోసం తనకు డబ్బులు వెంటనే చెల్లిస్తే తాను తక్కువ ఖర్చుతో సదరు వైద్య పరీక్షలు నిర్వహిస్తానని అటెండేట్‌కు తెలిపాడు. దీంతో అయోమయానికి గురైన సదరు అటెండెంట్ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది దృష్టికి తేవడంతో విషయం బయటపడింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆసుపత్రికి చెందిన భద్రతా సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
హాస్పిటల్‌పై చర్యలు
రోగుల వద్ద లక్షల రూపాయలు దండుకుంటూ ఇంత ఘోరంగా నిర్లక్ష్యం వహించిన విరంచి హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పేషెంట్స్ తరపు బంధువులు, నెటిజన్స్, పలు సామాజిక సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఎవరైనా ప్రత్యర్థులు ఇలా ఐసీయూలో ప్రవేశించి రోగులకు ఏమైనా హాని చేస్తే ఎవరు బాధ్యులు అని ప్రశ్నిస్తున్నారు.