- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'ముందుగా తామే తెలంగాణ విమోచన దినోత్సవం అని పేరు పెట్టాం'

దిశ, చార్మినార్: తెలంగాణ విమోచన అమృత మహోత్సవాలు సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్ భారీ బైక్ ర్యాలీని గురువారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. ఈ ర్యాలీ చార్మినార్ నుంచి సర్దార్ పటేల్ విగ్రహం వరకు నిర్వహించారు. కిషన్రెడ్డి శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిషన్రెడ్డి హెల్మెట్ ధరించి.. బీజేపీ మహిళా మోర్చా మహిళా నాయకురాలతో ర్యాలీగా జాతీయ జెండాలను చేతబూని బయలుదేరారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్, జైజై శ్రీరామ్, వందే మాతరం.. అంటూ దారిపొడవునా మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో తెలంగాణ విమోచన అమృత మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందజేశామన్నారు. 25 సంవత్సరాల క్రిందనే ముందుగా తాము తెలంగాణ విమోచన దినోత్సవం పేరు పెట్టడం జరిగిందని, అదే ఆశయంతో పని చేస్తున్నామన్నారు. ఎవరు ఏం చేస్తారో వాళ్ళ ఇష్టమని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గౌతమ్ రావు, శ్యామ్ సుందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బండ కార్తీకా రెడ్డి, ఉమా మహేందర్ తదితరులు పాల్గొన్నారు.