- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యాచక రహిత సమాజం నిర్మిద్దాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: మానవత్వ విలువలను సనాతన ధర్మాన్ని తెలియజేస్తూ యాచక రహిత సమాజ నిర్మాణంకు కృషి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్ఫూర్తి, విజేత విద్య సంస్థలకు సంబందించిన విద్య వేత్తలు ఆయనను కలిసి యాచక రహిత సమాజం, మానవత్వ విలువలు, ధర్మ యుగం అనే అంశాలపై వారు చేస్తున్నా కృషిని వివరించారు. ఈ సందర్బంగా ఆయా అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ పాడిన పాఠాలను విడుదల చేసి వారిని అభినందించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ అనేక చోట్ల తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, పిల్లలకు దూరమైన తల్లిదండ్రులు తిండిలేక రోడ్లపైన అడుక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో అనేక మంది శారీరక, మానసిక వికలాంగులు కూడా ఉంటున్నారని, వారికీ సరైన వసతులు కల్పించి అవసరమైన వారిని అనాథ ఆశ్రమాలలో చేర్పిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థి దశలో ఉన్న వారైతే గురుకుల పాఠశాలలో, చిన్న పిల్లలైతే అనాథ శరణాలయాలలో చేర్పిస్తున్నట్లు వివరించారు. తమకు స్వచ్ఛంద సేవా సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, స్థానిక ప్రజలు, వైద్య విద్యా సంస్థలు సహాయ సహకారాలు అందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం బాగా ప్రజల్లోకి తీసుకెళ్లితే పోలీస్ వ్యవస్థ, నగరపాలక సంస్థలు, ప్రజా సేవకులు కూడా సహకరించే అవకాశం ఉంటుందని అభిప్రాయ పడ్డారు. ఈ అంశాలతో కూడిన పాటను కిషన్ రెడ్డికి వందేమాతరం శ్రీనివాస్ వినిపించారు. ఈ అంశాలపై ఒక లఘు చిత్రాన్ని కూడా నిర్మించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో స్ఫూర్తి, విజేత విద్యా సంస్థల అధినేత రామకృష్ణం రాజు, వందేమాతరం శ్రీనివాస్, ముదిగొండ విశ్వేశ్వర శాస్ట్రీ, సుధీర్ వర్మ, నంద, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.