నానో పదార్థాలదే భవిష్యత్తు: ఉగాండా శాస్త్రవేత్త

by S Gopi |
నానో పదార్థాలదే భవిష్యత్తు: ఉగాండా శాస్త్రవేత్త
X

దిశ, చార్మినార్: అతి సూక్ష్మ పదార్ధాలు మానవుల నిత్యావసరాలను తీర్చడంలో ఎంతో ఉపయోగపడుతున్నాయని, భవిష్యత్తు అంతా నానో పదార్థాలదేనని ఉగాండా శాస్త్రవేత్త డా.మోజెస్ కిగోజి అన్నారు. ప్రభుత్వ సిటీ కళాశాల, భౌతిక శాస్త్ర విభాగం ఏర్పాటు చేసిన సదస్సులో ఆధునిక యుగంలో నానో సాంకేతికత ప్రాధాన్యత అనే అంశంపై డా.మోజెస్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నానో పరిశోధనలోని పదార్థాల ధర్మాలను తెలుసుకోవడానికి అనుసరించవలసిన విధానాన్ని విద్యార్థులకు వివరంగా తెలిపారు. ఈ అంశంపై ఇప్పుడు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయని, ఇంకా జరగవలసి ఉన్నదన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. బాల బాస్కర్ మాట్లాడుతూ నానో టెక్నాలజీ అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న ఈ తరుణంలో భౌతిక శాస్త్ర విభాగం వారు విద్యార్థులలో ఈ విషయం పట్ల విస్తృత అవగాహన ఏర్పరచి, పరిశోధన దిశగా వారికి మార్గదర్శనం కలిగించాలని అన్నారు. ఈ సదస్సుకు భౌతిక శాస్త్ర విభాగం అధిపతి డా. నైన వినోదిని, డాక్టర్ చిన్ని కృష్ణ, డాక్టర్ వాసుదేవ రెడ్డి, డాక్టర్​కె. పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed