ఈ నెల 17 నుంచి ఎడ్ సెట్ కౌన్సెలింగ్

by S Gopi |
ఈ నెల 17 నుంచి ఎడ్ సెట్ కౌన్సెలింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎడ్ సెట్ కౌన్సెలింగ్ ను ఈనెల 17 నుంచి ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. 18వ తేదీ నుంచి ఈనెల 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియతోపాటు ఫిజికల్ వెరిఫికేషన్ చేపట్టనున్నారు. 26 నుంచి 28 వరకు విద్యార్థుల స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. విద్యార్థుల వివరాల్లో తప్పుల సవరణకు ఈనెల 28వ తేదీన చేసుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 31న వెబ్ ఆప్షన్ల ఎడిట్ కు చాన్స్ ఇచ్చారు. వచ్చే నెల 4వ తేదీన అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను వెల్లడించనున్నారు. నవంబర్ 5 నుంచి 11వ తేదీ వరకు సీట్లు పొందిన విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్టింగ్ చేయడంతోపాటు ట్యూషన్ ఫీజు చెల్లించాలని అధికారులు తెలిపారు. తరగతులను నవంబర్ 14 నుంచి ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. ఇతర వివరాలకు http://edcetadm.tsche.ac.in వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.



18 నుంచి పీఈసెట్

టీఎస్ పీఈసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల18 నుంచి ప్రారంభంకానుంది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 19వ తేదీ నుంచి ఈనెల 26వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా ఈనెల 28వ తేదీన అర్హుల జాబితాను ప్రకటించనున్నారు. 29, 30 తేదీల్లో ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు, 31న ఎడిట్ ఆప్షన్ కు అధికారులు అవకాశం కల్పించారు. వచ్చే నెల 2వ తేదీన అభ్యర్థులకు సీట్లకు కేటాయించనున్నారు. నవంబర్ 3 నుంచి 11వ తేదీ వరకు విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో సెల్ఫ్ రిపోర్టింగ్ కు అవకాశం కల్పించారు. పీఈసెట్ సీటు పొందిన అభ్యర్థులకు వచ్చే నెల 14 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. ఇతర వివరాలకు http://pecetadm.tsche.ac.in వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.

Next Story

Most Viewed