హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ ఆంక్షలు..

by Javid Pasha |
హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ ఆంక్షలు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో జూన్ 2న హైదరాబాద్ సిటీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. కార్యక్రమానికి సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. ఉదయం 7.30 నుండి 11 గంటల వరకు ఆంక్షలు అమలు కానున్నాయి. తాజ్ ఐల్యాండ్, చపెల్ రోడ్ టీ జంక్షన్, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, బషీర్భాగ్ జంక్షన్, ఇక్బాల్ మినార్, ఎఆర్ పెట్రోల్ పంప్, ఆదర్శ్ నగర్, దీనికి సంబంధించిన రూట్ మ్యాప్‌లను నెటిజన్లతో పంచుకున్నారు. పోలీసులకు, నగరవాసులు సహకరించాలని కోరారు. కాగా, మరో ట్వీట్ లో ఫార్మేషన్ డేకి సంబంధించిన కార్ పార్కింగ్ డీటెల్స్ ని షేర్ చేశారు.

Next Story

Most Viewed