త్వరలో అమెరికాకు కేటీఆర్... !

by srinivas |
త్వరలో అమెరికాకు కేటీఆర్... !
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, ప్రజలంటే వారికి చిన్నచూపు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఓటమి ఖాయమని తెలిసే కేసీఆర్ మీడియాకు ముఖం చాటేశారని, గతంలో పోలింగ్ ముగియగానే కేసీఆర్ మీడియా ముందుకు వచ్చేవారని గుర్తు చేశారు. ఫలితాలు వెలువడ్డాక కేటీఆర్ కూడా త్వరలోనే అమెరికా వెళ్లిపోతారని జోస్యం చెప్పారు. పోలింగ్ ముగిసిన తర్వాత కామారెడ్డిలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.


డిసెంబర్ 3కు తెలంగాణలో ఎంతో ప్రత్యేకత ఉందని, ఆ రోజే శ్రీకాంతాచారి తుదిశ్వాస విడిచారని గుర్తు చేశారు. అదే రోజున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని, డిసెంబర్ 3న దొరల తెలంగాణ అంతం అవుతుందని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్‌పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.కేటీఆర్ చెప్పింది తప్పయితే... ప్రజల ముందుకు వచ్చి క్షమాపణలు చెబుతారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌కు 25 కంటే ఒక్క సీటు కూడా దాటదని సునామీ వస్తే గడ్డపారలే కొట్టుకుపోతాయని, గడ్డి పోచ ఓ లెక్కనా అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్య విలువలను పునరుద్దరిస్తుందని, సీఎల్పీలో చర్చించి ప్రభుత్వ ఏర్పాటు తేదీ నిర్ణయిస్తుందన్నారు. కోదండరామ్‌కు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న రేవంత్ రెడ్డి.. సంబరాల కోసం కాంగ్రెస్ శ్రేణులు డిసెంబర్ 3 వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. ఈరోజు నుంచే సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Read More..

63 సీట్లతో మూడోసారి అధికారంలోకి BRS..! శ్రీ ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు



Next Story

Most Viewed