- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టిపిఎ రాష్ట్ర అధ్యక్షుడు నాగటి నారాయణ మృతి

దిశ, ముషీరాబాద్ : ఉపాధ్యాయ ఉద్యమ సీనియర్ నాయకులు, యుటిఎఫ్ పూర్వ అధ్యక్షులు, టిపిఎ రాష్ట్ర అధ్యక్షులు నాగటి నారాయణ ( 66 ) సోమవారం మృతి చెందారు. గత నాలుగు నెలలుగా ఊపిరి తిత్తుల క్యాన్సర్‌తో నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అనంతరం చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. కార్యకర్తల సందర్శనార్థం కోసం దోమలగూడలోని టిఎస్ యుటిఎఫ్ కార్యాయలంలో ఉంచారు. ఆ తర్వాత ఖమ్మంలో టిఎస్ యుటిఎఫ్ కార్యాలయానికి తరలించారు.
నారాయణ ఆకస్మిక మృతి ప్రజాతంత్ర ఉద్యమాలకు తీరనిలోటు :
యుటిఎఫ్, ఉమ్మడి ఏపిలో దశాబ్ద కాలానికి పైబడి యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రధాన సంపాదకులుగా సేవలందించిన నాగటి నారాయణ మృతి ప్రజాతంత్ర ఉద్యమాలకు తీరనిలోటని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావి రవి, ప్రధాన సంపాదకులు మాణిక్‌రెడ్డి, మస్తాన్‌రావులు అన్నారు. దోమలగూడలోని యుటిఎఫ్ కార్యాలయంలో నారాయణ మృతదేహానికి అధ్యక్ష, కార్యదర్శులు, ఆఫీస్ బేరర్లు లక్ష్మారెడ్డి, కొండల్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సిలు నంద్యాల నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, గౌరీశంకర్, సుధాకర్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, రవీందర్, రవీందర్ రెడ్డి, సారంపల్లి మల్లారెడ్డి తదితర నేతలు నివాళులర్పించారు