- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో వాన బీభత్సం.. క్షేత్రస్థాయిలో హైడ్రా చీఫ్ పర్యవేక్షణ
హైదరాబాద్ మహానగరంలో కుండపోత వర్షం కురిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో భారీ వర్షం కురిసింది. బేగంపేట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో దాదాపు 9 సెంటీ మీటర్ల వర్షం పడింది. ట్యాంక్‌బండ్‌తో పాటు.. సచివాలయం ఎదుట రహదారులపై మోకాళ్లలోతు నిలబడిపోవడంతో ఆ నీటిని తొలగించేందుకు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది కృషి చర్యలు చేపట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి హైడ్రా సేవలను పర్యవేక్షించారు. ట్యాంక్‌బండ్ మీద సికింద్రాబాద్ వైపు వర్షపు నీరు నిలిచిపోవడమే కాకుండా.. చెట్టు పడిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. చెట్టును తొలగించే పనులతో పాటు.. వరద సాఫీగా సాగేలా హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది క్లియర్ చేసింది. రహదారిపై పడిన చెట్లను తొలగించారు. రోడ్లపై నిలిచిపోయిన వరద నీటిని క్లియర్ చేశారు. శేరిలింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, షేక్‌పేట, టోలిచౌకి, మాదాపూర్ ప్రాంతాలతో పాటు.. సికింద్రాబాద్, హైదర్‌గూడ ప్రాంతాల్లో హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో సేవలందించారు. దాదాపు 76 చోట్ల చెట్లు పడిపోవడంతో వాటిని తొలగించే పనుల్లో హైడ్రా సిబ్బంది నిమగ్నమైంది.
బతుకమ్మకుంటకు భారీగా వరద..
అంబర్‌పేటలోని బతుకమ్మకుంటకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రవాహంలా వస్తున్న వరద గతంలో పరిసర బస్తీలను, కాలనీలు ముంచెత్తేది. బతుకమ్మకుంటకు వరద నీరు చేరేలా హైడ్రా ఏర్పాట్లు చేయడంతో ఇప్పుడు ఆ ముప్పు తప్పింది. ఎండాకాలంలో నీరు తక్కువగా ఉండడంతో చెరువు చుట్టూ పాత్‌వేపై వాకింగ్ చేసేందుకు వచ్చిన వారు ఆందోళన చెందారు. ఒక్క వర్షానికే వరద నీరు భారీగా వచ్చి చేరడంతో పరిసర ప్రాంతాలకు వరద ముప్పు తప్పడమే కాకుండా.. చెరువు నిండడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.






