- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గన్ ఫౌండ్రీ.. 1788లో ఫిరంగుల తయారీ

దిశ ప్రతినిధి, హైదరాబాద్ నిజాంల కాలంలో రక్షణ కోసం వినియోగించే ఆయుధాలు తయారు చేయడానికి ఫతే మైదాన్‌లో ఏర్పాటు చేసిన కొలిమి ప్రాంతం నేడు గన్ ఫౌండ్రీగా పిలువబడుతోంది. హైదరాబాద్ రెండో నిజాం (1762 - 1803 ) నవాబ్ మీర్ నిజాం అలీ ఖాన్ కాలంలో రాజ్య రక్షణ కోసం ఏర్పాటు చేసిన సైనిక కమాండర్ జనరల్ మన్సూర్ రేమండ్ 1788లో ఆయుధ కర్మాగారానికి రూపకల్పన చేశారు. ఫ్రాన్స్ దేశానికి చెందిన మన్సూర్ రేమండ్ వ్యాపార నిమిత్తం పాండిచ్చేరికి చేరుకున్నారు. అనంతరం ఈ ప్రాంతం బ్రిటిష్ వారి హస్తగతం కాగా.. ఆయన ఈ వ్యాపారాన్ని వదిలిపెట్టి సైనికుడిగా మారారు. ఆ తర్వాత మైసూరులో హైదర్ అలీ కొలువులో చేరారు.
ఆయన మరణానంతరం బసాలత్ జంగ్ నాయకత్వంలోని ఫ్రెంచ్ కోర్‌లో చేరారు. ఆ తర్వాత రెండవ నిజాం సైన్యంలో చేరి, కమాండర్ స్థాయికి చేరుకున్నారు. నిజాం రాజ్యంలో పదిహేను వేల మంది సైనికుల కూటమిని రూపొందించారు. నిజాం అనుమతితో ఆయుధ తయారీకి అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. తుపాకులు, మందు గుండు సామాగ్రి, ఫిరంగులు, తోపులను రూపొందించే విభాగాలను, యంత్ర సామగ్రిని సమకూర్చుకున్నారు. అదే నగరంలోని నేటి గన్ ఫౌండ్రీ ప్రాంతం.
Also Read: రాష్ట్రపతి నిలయం.. నాటి బ్రిటీష్ రెసిడెన్షీ హౌస్‌గా రాజ్ మహల్