అశ్లీల వీడియోలను చూస్తూ... షేర్ చేస్తున్నారా…ఇది మీ కోసమే..!

by Kalyani |
అశ్లీల వీడియోలను చూస్తూ... షేర్ చేస్తున్నారా…ఇది మీ కోసమే..!
X

దిశ, సిటీ క్రైమ్ : స్నాప్ చాట్, ఇన్ స్టాగ్రాం సోషల్ మీడియా ఖాతాల మీదుగా చిన్న పిల్లల లైంగిక దాడులకు సంబంధించిన వీడియోలను పంపిస్తున్న ముగ్గుర్ని సోమవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ఫ్లాయిడ్ చిల్డ్రన్ పోర్టల్ సిబ్బంది సైబర్ టిప్ లైన్ కేసులను నమోదు చేసి సిటీ పోలీుసులకు పంపింది. వాటిని దర్యాప్తు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. టిప్ లైన్ కేసుల వివరాలు ఇలా...

*మెదక్ జిల్లాకు చెందిన 35 సంవత్సరాల ఓ ప్రైవేటు ఉద్యోగి పిల్లల పై జరిగే లైంగిక దాడులకు సంబంధించిన వీడియోలను వివిధ వెబ్ సైట్ లలో అధికంగా వీక్షిస్తూ వాటిని ఇన్ స్టాగ్రాం ద్వారా స్నేహితులకు పంపిస్తున్నాడు. అతనిని అరెస్టు చేసి ఎం. సీతారాములు ఇన్స్ పెక్టర్ దర్యాప్తును చేస్తున్నారు.

*హైదరాబాద్ కు చెందిన 36 సంవత్సరాల ఓ వెల్డర్ కూడా ఇలాంటి అశ్లీల వీడియోలను వివిధ వెబ్ సైట్ లలో చూస్తున్నాడు. వాటిని డౌన్ లోడ్ చేసుకుని స్నేహితులకు స్నాప్ చాట్ ద్వారా షేర్ చేస్తున్నాడు. ఈ కేసును ఇన్స్ పెక్టర్ మట్టం రాజు దర్యాప్తు చేస్తున్నారు.

*హైదరాబాద్ కు చెందిన 22 సంవత్సరాల విద్యార్థి కూడా ఈ తరహా అశ్లీల వీడియోలను తరచుగా వీక్షిస్తూ వాటిని డౌన్ లోడ్ చేసి స్నేహితులకు ఇన్ స్టాగ్రాం ద్వారా పంపిస్తున్నాడు. ఈ కేసును ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు దర్యాప్తు చేస్తున్నారు.

ఇలాంటి కంటెంట్ లు ఎవరికైనా వచ్చినా, ఎవరైనా చేస్తున్నా వెంటనే వాటి సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని అధికారులు కోరుతున్నారు. ఇలా వచ్చిన కంటెంట్ ను షేర్ చేసినా చట్టపరంగా నేర పరిధిలోకి వస్తారని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed