- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Munugodu by-poll: మునుగోడు ఓటర్లకు బీజేపీ గాలం..?

దిశ, ఎల్బీనగర్ : ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న మునుగోడు ఓటర్లకు బీజేపీ గాలం వేస్తుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రతి ఓటు కీలకం కానుంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఓటర్లను గుర్తించడంలో మిగతా ప్రత్యర్ధుల కంటే కమలనాధులు ముందంజలో ఉన్నారు. ఇప్పటికే మూడు దఫాలుగా మునుగోడు ఓటర్లతో సభలు సమావేశాలు నిర్వహించడం గమనార్హం. నల్గొండ జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో వలస వచ్చి సెటిల్ అయిన ప్రాంతం ఎల్బీనగర్. ఉద్యోగ, ఉపాధి, పిల్లల చదువులు కోసం అత్యధిక శాతం ఉన్నారు. ఇది గమనించిన బీజేపీ అధిష్టానం ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న మునుగోడు ఓటర్లను గుర్తించమని కార్పొరేటర్లను పురమాయించి నట్లు సమాచారం. ఇప్పటికే ఎల్బీనగర్ లో మునుగోడు ఓటర్లతో ఓ ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహించారు. కాగా హయత్ నగర్ లో గత పది రోజుల నుండి రెండు రోజులకోసారి రహస్య సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
జాడ లేని కాంగ్రెస్ నేతలు..!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం మునుగోడు నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలోని ఎల్బీనగర్ లోని మునుగోడు ఓటర్ల గురించి ప్రస్తావించారు. అయితే స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న మునుగోడు ఓటర్లను పట్టించుకోవడంలేదని పార్టీ శ్రేణుల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ లమని చెప్పుకుంటున్న ఇద్దరు నేతలు పట్టించుకోకపోవడంతో కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది.
వెనుకంజలో కారు..?
ఎల్బీనగర్ లో ఉన్న మునుగోడు ఓటర్లను గుర్తించడంలో కారు వెనకంజలో ఉంది. మునుగోడు ఓటర్లతో కమలం పార్టీ రహస్య సభలు సమావేశాలు నిర్వహిస్తుండగా.. గులాబీ పార్టీ మాత్రం అంటి ముట్టనట్లు వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి వరకు మునుగోడు ఓటర్లతో ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయకపోవడంతో కార్యకర్తల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఎల్బీనగర్ లోని మునుగోడు ఓటర్లకు ప్రాధాన్యత సంతరించుకోవడం గమనార్హం.