- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం..

దిశ, సికింద్రాబాద్: గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఓయూలో గిరిజన విద్యార్థి నాయకులు, అధ్యాపకులు సంబురాలు జరుపుకున్నారు. ఈ మేరకు శనివారం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఆల్ ఇండియా బంజారా స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కరాటే రాజునాయక్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్ పెంపుతో అనేక గిరిజన కుటుంబాల్లో కేసీఆర్ వెలుగులు నింపారని ప్రశంసించారు.
గిరిజన విద్యార్థుల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. రాష్ట్రంలో గిరిజనుల జనాభా పది శాతం ఉన్నప్పటికీ, వారికి విద్య, ఉద్యోగాలలో ఆరు శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉండడంతో తీవ్రంగా నష్టపోయారని, వారి రిజర్వేషన్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం గిరిజనుల పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. దీనిపై యావత్ గిరిజన జాతి హర్షం వ్యక్తం చేస్తోందని చెప్పారు. కేసీఆర్‌కు రాష్ట్రంలోని గిరిజన ప్రజలందరూ రుణపడి ఉంటారని పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిన కేసీఆర్ తాజాగా దళితబంధులాగే గిరిజనబంధు కూడా ఇస్తామని ప్రకటించడం గొప్ప విషయమన్నారు. పోడు భూముల సమస్యకు సైతం శాశ్వత పరిష్కారం చూపెడతానని ప్రకటించినందుకు ధన్యవాదాలు చెప్పారు.
గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా వారి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని కేసీఆర్ నిరూపించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు గుగులోత్ శ్రీరామ్ నాయక్, నేషనల్ బంజారా ప్రొఫెసర్స్ అసోసియేషన్ (ఎన్పీపీఏ) అధ్యక్షుడు డాక్టర్ ఆర్. చంద్రునాయక్, ఓయూ ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు, ప్రొఫెసర్ గోపాల్ నాయక్, డాక్టర్ బాలు, వాణిజ్యపన్నుల శాఖ అధికారి డాక్టర్ ధనంజయనాయక్, భీమ్లా, సుందర్ నాయక్,లక్ష్మణ్ నాయక్, రాజ్ కుమార్, సైదులు, శరత్, సుబ్బు, ప్రతాప్, భరత్ తదితరులు పాల్గొన్నారు.