- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి సీఎస్ కు వినతి పత్రాన్ని అందజేసిన టీఎన్జీవో సంఘం

దిశ, అంబర్ పేట్: ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.ఆంధ్రాలో పని చేస్తున్న 123 మంది తెలంగాణ ఉద్యోగులను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చిన మేరకు వెంటనే వెనకి తీసుకురావాలని కోరారు. సస్పెన్షన్ లో రెండు సంవత్సరాలకు పైగా ఉన్న ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. 317 జీవో అమలు వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి తెలిపారు.
ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం రెండు శాతం చందాతో ఈహెచ్ఎస్ సౌకర్యాన్ని కల్పించాలని పేర్కొన్నారు. అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో టీఎన్జీవో కార్యాలయానికి ఆఫీసును కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకట్ , కోశాధికారి రామినేని శ్రీనివాసరావు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్, హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడు శ్రీరామ్ పాల్గొన్నారు.