- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- ఉగాది రాశి ఫలాలు
- Job Notifications
- OTT Release
- భక్తి
కుటుంబ అభివృద్ధిలో స్త్రీ పాత్ర కీలకం

దిశ, అంబర్ పేట్ : కుటుంబ అభివృద్ధిలో స్త్రీ పాత్ర ఎంతో గొప్పదని పలువురు వక్తలు అన్నారు. శ్రీ సాయి అలేఖ్య సాంస్కృతిక సంఘ సేవా సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో శోభకృత్ నామ ఉగాది సందర్భంగా రాష్ట్ర స్థాయి బాల రత్న పురస్కారాలు, ఉపాధ్యాయ గురు పురస్కారాలతో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను రవీంద్ర భారతిలోని సమావేశం మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,
తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణు గోపాలచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగుతన్నారని స్పష్టం చేశారు. మానవ జాతికి మహిళ ఒక వరం అని అన్నారు. మహిళాభ్యుదయానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా పని చేస్తుందన్నారు. మహిళ అభ్యున్నతి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. వివిధ రంగాలలో సేవలందించిన వారిని గుర్తించి అవార్డులను ప్రదానం చేయడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో సాయి అలేఖ్య సాంస్కృతిక సంఘ సేవా సంస్థ అధ్యక్షురాలు ఉపదృష్ట అరుణ అశోక్ , సరస్వతీ దేవి ఉపాసకుడు దైవజ్ఞ శర్మ ప్రసాద్, సుమలత , వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.