బైక్ స్కిడ్ అయి వ్యక్తి మృతి

by Seetharam |
బైక్ స్కిడ్ అయి వ్యక్తి మృతి
X

దిశ, సికింద్రాబాద్: బైక్ స్కిడ్ అయి కింద పడిపోవడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓయూ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామానికి చెందిన చాంద్ పాషా (31) చిలుకానగర్‌లో ఉంటూ లోన్ రికవరీలో పని చేస్తున్నాడు.

బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో చాంధ్ పాషా అడికేమేట్ నుంచి తన నివాసానికి వెళ్తుండగా, ఓయూ బీఈడీ కళాశాల సమీపంలో బైక్ స్కిడ్ అయింది. ఈ క్రమంలో డివైడర్ పై ఉన్న కరెంట్ స్తంభానికి బైక్ ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు ఓయూ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed