లిఫ్ట్​ అడిగిన మైనర్ బాలిక కిడ్నాప్.. స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి..

by Vinod kumar |   ( Updated:2022-06-05 10:42:55.0  )
లిఫ్ట్​ అడిగిన మైనర్ బాలిక కిడ్నాప్.. స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి..
X

దిశ, చార్మినార్: సంచలనం సృష్టించిన జూబ్లిహిల్స్‌లో మైనర్​బాలిక సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తులో ఉండగానే.. పహాడి షరీఫ్‌లో లిప్ట్​ అడిగిన 12 ఏళ్ళ మైనర్​బాలికపై కీచకులు పంజావిసిరారు. కారులో మైనర్ బాలికను కిడ్నాప్​చేసి, ఓ ఇంట్లో అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని మొఘల్​పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మొఘల్​పుర ఇన్​స్పెక్టర్​ రవికుమార్​తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీలోని సుల్తాన్​షాహీ ప్రాంతంలో తన తాత, అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న మైనర్​బాలిక (12) స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. ఆ బాలిక తల్లిదండ్రులు మాత్రం పహాడిషరీఫ్‌లోని షాహిన్​నగర్​ప్రాంతంలో నివాసముంటున్నారు.

ఈ నెల 31 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా ఒంటరిగా షాహిన్​నగర్‌లోని తన తల్లిదండ్రుల దగ్గరికి కాలినడకన బయలుదేరింది. రాత్రి 8 గంటల వరకు 10 కిలోమీటర్ల దూరం నడిచింది. పహాడి షరీఫ్​కమాన్​వద్దకు చేరుకోగానే అలసిపోయిన బాలిక లిఫ్ట్​కోసం ఎదురు చూడసాగింది. అటుగా వస్తున్న క్యాబ్‌ను లిఫ్ట్​అడగగా.. బహదూర్​పురా కు చెందిన క్యాబ్​డ్రైవర్​షేక్​ఖలీం (34) తన కారులో షాహిన్​నగర్‌లో వదిలి పెడతానంటూ బాలికను కారులో ఎక్కించుకున్నాడు. ఒంటరిగా ఉన్న బాలిక పై కన్నేశాడు. ఎలాగైనా లొంగదీసుకోవాలని పథకం వేశాడు. ఆ బాలికకు మాయమాటలు చెబుతూ.. రెండు గంటల పాటు పహాడీ షరీఫ్​పరిసర ప్రాంతంలోనే కారును తిప్పుతూ కాలయాపన చేశాడు.


కిషన్​బాగ్‌కు చెందిన డైరీ ఫాం నడుపుకునే తన స్నేహితుడు లుక్మాన్(34) కు ఫోన్​ చేసి జరిగిన విషయాన్ని వివరించాడు. ఆ బాలికను కిడ్నాప్​చేసి క్యాబ్‌లో లుక్మాన్​సొంతూరు రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​సమీపంలోని కుందుర్గ గ్రామంలోని ఇంటికి తీసుకువెళ్ళారు. షేక్​ఖలీం, లుక్మాన్‌లు ఒంటరి మైనర్​బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించారు.

బాలిక ప్రతిఘటించడంతో పాటు గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టింది. దీంతో వెంటనే లుక్మాన్​ఇక్కడి నుంచి బాలికను తీసుకెళ్ళు అంటూ షేక్​ ఖలీం కు చెప్పారు. బాలికను తీసుకుని కారులో బయలుదేరిన క్యాబ్​ డ్రైవర్​షేక్​ఖలీం జూన్​1వ తేదీన తెల్లవారుజామున 5 గంటలకు మొఘల్​పుర పోలీస్​స్టేషన్​వద్ద వదిలిపెట్టి పరారయ్యాడు. విషయాన్ని గమనించిన మొఘల్​పుర పోలీసులు బాలికను ఆరాతీయగా జరిగిన విషయాన్ని వివరించింది. తన కుటుంబ సభ్యులతో కలిసి బాలిక మొఘల్​పురా పోలీస్​స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలికను భరోసా సెంటర్‌కు పోలీసులు తరలించారు.

అంతకుముందే మొదట బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొఘల్​పుర పోలీసులు మిస్సింగ్​కేసును నమోదు చేశారు. అనంతరం బాలిక ఫిర్యాదుతో ఫోక్సో చట్టం కింద కేసును మార్చారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి నుంచి తప్పించుకుతిరుగుతున్న షేక్​ ఖలీం, లుక్మాన్‌లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Next Story

Most Viewed