పంచాయతీరాజ్​శాఖ కార్మికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఒకటో తేదీనే వేతనాలు

by srinivas |
పంచాయతీరాజ్​శాఖ కార్మికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఒకటో తేదీనే వేతనాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : పంచాయతీరాజ్​శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంచాయతీరాజ్​శాఖలో పనిచేస్తున్న 92 వేల మంది పారిశుద్ద్య కార్మికులు, బిల్​ కలెక్టర్‌లు, ఉపాధి హామీ ఉద్యోగులు, సెర్ప్‌లో పనిచేస్తున్న వీవోఏలకు నేరుగా ప్రభుత్వం నుంచి ప్రతి నేల వేతనాలు అందనున్నాయి. రెగ్యులర్​ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే ఒకటో తేదీన వేతనాలు జమ అవుతున్నాయో వీరికి ఇకపై వేతనాలు జమ కానున్నాయి. దీని కోసం ప్రభుత్వం గ్రీన్​ఛానల్​ వ్యవస్థను ఏర్పాటుచేసింది. ఉద్యోగులు వేతనాల కోసం ఎదురుచూడోద్దు... పంచాయతీలకు వారి వేతనాలు భారం కావద్దనే ఉద్దేశంతో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వీరికి వేతనాలు ఎప్పుడో వస్తాయో వారికే తెలిసేది కాదు. పండుగ ఉన్న , పబ్బం ఉన్న వారికి మాత్రం వేతనాలు మాత్రం సకాలంలో అందేవి కావు. 92,175 మందికి స‌కాలంలో జీతాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఫైల్‌కు ఆర్దిక శాఖ క్లియ‌రెన్స్ ఇచ్చింది. ఏప్రిల్‌కు సంబంధించిన వేతనం మే 1న వీరికి వేతనం జమ కానుంది. వీరికి నెలకు రూ.115.35కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించనున్నారు. పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న 52వేల మంది పారిశుద్ధ్య కార్మికులకు పంచాయతీలే వారికి వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. అనేక పంచాయతీలకు నిధులు లేక నెలలుగా వేతనాలు పెండింగ్​లో ఉంటున్నాయి.

ఈ నేపథ్యంలో వారి వేతనాలకు ఎలాంటి ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంతో పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సీత‌క్క చొర‌వ‌తో అమ‌ల్లోకి నూత‌నాన్ని ఆర్థిక శాఖకు ప్రతిపాదించారు. దీంతో ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది. దీంతో పంచాయతీలతో పనిలేకుండా నేరుగా వేతనాలు అందనున్నాయి. వారి బ్యాంకు అకౌంట్లను ఇప్పటికే సేకరించారు. వారి హాజరు వివరాలను ప్రతి నెల 25వ తేదీ వరకే సేకరిస్తారు. 26వ తేదీన వేతనాల బిల్​ను జనరేట్​ చేసి వేతనాలు అందిస్తారు. పంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే ఆ నిధులను పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలుగా ఇచ్చే వారు. లేదా స్థానికంగా పంచాయతీల్లో వసూలు బిల్లులు, ఇతర ఆదాయాల నుంచి వేతనాలు చెల్లించే వారు. ఇలా ప్రతి నెలా వారి వేతనాలకు ఇబ్బందులు, తిప్పలు తప్పడంలేదు. వారి కుటుంబాలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వాటన్నంటికి స్వస్తి పలుకుతూ నూతన విధానాన్ని తీసుకవచ్చారు. నూతన విధానంతో మంచి ఫలితాలు వస్తాయని పంచాయతీరాజ్​ శాఖ అంచనా వేస్తుంది.

మే నుంచి ప్రతి నెల ఒకటో తేదీన వేతనం అందుకోనున్న ఉద్యోగుల వివరాలు...

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

హోదా ఉద్యోగుల సంఖ్య నెలకు చెల్లించే వేతనం

(రూ.కోట్లలో)

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు 52,473 49.38

సెర్ప్​ వీవోఏలు, ఇతరులు 22,011 30.87

ఉపాధి హామీ ఉద్యోగులు 12,586 25.87

జీపీ కంప్యూటర్​ ఆపరేటర్లు 1301 2.78

ఎంపీపీ పార్ట్​ టైం వర్కర్లు 1330 0.65

అవుట్​ సోర్స్​ పంచాయతీకార్యదర్శులు 792 1.45

జూనియర్​ పంచాయతీ కార్యదర్శులు 817 2.34

మండల కంప్యూటర్​ ఆపరేటర్లు 278 0.60

ఇతరులు 587 1.41

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

మొత్తం 92,175 115.35

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––



Next Story