తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం.. కోకా కోలా సంస్థ భారీగా పెట్టుబడులు

by Disha Web Desk 16 |
తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం.. కోకా కోలా సంస్థ భారీగా పెట్టుబడులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ‌కు పెట్టుబ‌డుల ప్రవాహం కొన‌సాగుతోంది. కోకా కోలా సంస్థ రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. అంతేకాదు తమ కార్యకలాపాలను విస్తృతంగా విస్తరించేందుకు రెడీ అయింది. తన అదనపు పెట్టుబడుల ప్రణాళికలను తాజాగా ప్రకటించింది. సిద్దిపేట‌లోని ప్లాంట్‌ను మ‌రింత విస్తరించాల‌ని కోకా కోలా సంస్థ నిర్ణ‌యం తీసుకుంది. ఈ ప్లాంట్‌లో అద‌నంగా రూ. 647 కోట్ల పెట్టుబ‌డులు పెట్టాల‌ని నిర్ణ‌యించింది.

మరోవైపు వ‌రంగ‌ల్ లేదా క‌రీంన‌గ‌ర్‌లో రెండో త‌యారీ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో రూ. 2,500 కోట్ల పెట్టుబ‌డులు కోకా కోలా సంస్థ‌ పెట్టింది. తమ ప్రణాళికలను న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌‌కు వివరించింది. ఈ సందర్భంగా కోకాకోలా సంస్థ ఉపాధ్యక్షుడు జేమ్స్ మేక్ గ్రివి మాట్లాడుతూ తమ సంస్థకు ప్రపంచంలో మూడవ అతిపెద్ద మార్కెట్ భారత్ అని తెలిపారు. భారత్‌లో తమ కార్యకలాపాలను, వ్యాపారాన్ని మరింతగా విస్తరించే వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.

అటు మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణకు అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయనడానికి కోకా కోలా సంస్థ ప్రకటించిన అదనపు పెట్టుబడి సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఆ సంస్థకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed