సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన మొదటి భారత్ గౌరవ్ రైలు

by Disha Web Desk 15 |
సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన  మొదటి  భారత్ గౌరవ్ రైలు
X

దిశ, మెట్టుగూడ : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ నుండి మొట్టమొదటి భారత్ గౌరవ్ రైలు శనివారం సికింద్రాబాద్ స్టేషన్ నుండి ప్రయాణాన్ని ప్రారంభించింది. రైలు లో ప్రయాణించే యాత్రికులకు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ యాత్రికులకు స్వాగత కిట్‌లను అందజేశారు. ఇందులో వసతి సౌకర్యం, క్యాటరింగ్ ఏర్పాట్లు (ఉదయం టీ, అల్పాహారం , మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం - రైలు ప్రయాణంలో మరియు వెలుపల రెండూ) కల్పించారు. ప్రయాణ బీమా కూడా ఉంది.

ఈ పర్యటనలో పూరీ , కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య మరియు ప్రయాగ్‌రాజ్‌లోని ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలను 8 రాత్రులు, 9 పగళ్లు ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ జైన్, ఐఆర్‌సీటీసీ సీఎండి రజనీ మాట్లాడుతూ పలు ప్రముఖమైన పుణ్య క్షేత్రాలను సందర్శించడానికి ఈ రైలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తక్కువ ఖర్చుతో, సురక్షితమైన మరియు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తుందని వారు పేర్కొన్నారు.


Next Story

Most Viewed