స్థానికత కోల్పోయిన ఉద్యోగులను తిరిగి సొంత జిల్లాలకు కేటాయించాలి

by Disha Web Desk 15 |
స్థానికత కోల్పోయిన ఉద్యోగులను తిరిగి సొంత జిల్లాలకు కేటాయించాలి
X

దిశ, ముషీరాబాద్ : 317 జీవో వలన స్థానికత కోల్పోయిన ఉద్యోగులను తిరిగి సొంత జిల్లాలకు కేటాయించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ నాన్ స్పౌజ్ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ఉపాధ్యాయులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మనోవేధన మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండ రామ్ మాట్లాడుతూ దాదాపు 20 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు పదివేల మందికి పైగా తమ స్థానికతను కోల్పోయి కుటుంబాలకు దూరంగా బతుకుతూ, ఉద్యోగాలు చేస్తూ మానసిక క్షోభ అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటి ఒత్తిడిని తట్టుకోలేక దాదాపు 30 మంది ఉద్యోగులు తమ ప్రాణాలను కోల్పోయారని తెలిపారు. ప్రతిరోజూ దాదాపు 200 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. స్థానికత కోల్పోయిన ఉద్యోగులను తిరిగి సొంత జిల్లాలకు కేటాయించాలన్నారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయ్ కుమార్, దత్తాద్రి హాజరై మాట్లాడుతూ...

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, చిన్న పిల్లలను వదిలేసి ఉద్యోగాలు చేస్తూ మానసిక వేదన అనుభవిస్తున్నారు అని అన్నారు. ఈ సభ లో వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, టీపీఎస్ఏ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు దూడ రాజనర్సుబాబు, పాలిటెక్నిక్ ఎంప్లాయిస్ యూనియన్ సందీప్ , మెడికల్ ఎంప్లాయిస్ వినీత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story