తెలుగు సాంస్కృతికి ప్రతీకలు పండుగలు : వేణుగోపాలాచారి

by Disha Web Desk 15 |
తెలుగు సాంస్కృతికి  ప్రతీకలు  పండుగలు : వేణుగోపాలాచారి
X

దిశ, అంబర్ పేట్ : తెలుగు సాంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా పండుగలు నిలుస్తాయని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ డా.సముద్రాల వేణుగోపాలాచారి, కథక్ కళాక్షేత్ర అధ్యక్షుడు, ప్రముఖ నాట్య గురువు పండిట్ అంజిబాబు అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మయూరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో సేవలందించిన వారికి సంక్రాంతి పురస్కారాలు 2023 ప్రదానోత్సవ కార్యక్రమం భారతీయ విద్యా భవన్ లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సముద్రాల వేణుగోపాలాచారి, డాక్టర్ పండిట్ అంజిబాబు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మయూరి ఆర్ట్స్ సంస్థ విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ కళలు, కళాకారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. వివిధ రంగాలలో సేవలందించిన వారిని గుర్తించి పురస్కారాలను అందజేయడం అభినందనీయమన్నారు. అనంతరం వివిధ రంగాలలో సేవలందించిన వారికి సంక్రాంతి పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జానపద గాన కోకిల డాక్టర్ అరుణ సుబ్బారావు, ప్రముఖ సినీనటి సంధ్యా జనక్ , ప్రముఖ సినీ డైరెక్టర్ బాలాజీ డాక్టర్ నాయక్, ప్రముఖ టీవీ నటుడు సుమిత్ రాయ్ , ప్రముఖ సినీ దర్శక, నిర్మాత సంతోష్ వాడకట్టు, మయూరి ఆర్ట్స్ చైర్ పర్సన్ మయూరి రాధ, మయూరి ప్రోగ్రాం డైరెక్టర్స్ సాయి ప్రియ, దత్తు పాల్గొన్నారు. సభకు ముందు 12 తెలుగు పండుగలు 12 పాటలతో తెలుగు విశిష్టతను తెలియజేస్తూ కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.



Next Story