అమరుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం

by Disha Web Desk 15 |
అమరుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం
X

దిశ, ఎల్బీనగర్ : అమరుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ఆవరణలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ తో కలిసి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నో వందల మంది అమరుల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ జయశంకర్ సార్ కి నివాళులు అర్పించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజల భద్రత కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నామని తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యల ద్వారా కమిషనరేట్ పరిధిలో నేరాల శాతం గణనీయంగా తగ్గిందని కమిషనర్ పేర్కొన్నారు. కమిషనర్ తో పాటు చైతన్యపురి ఇన్ స్పెక్టర్ సిబ్బంది పాల్గొన్నారు.



Next Story